Wednesday, January 22, 2025

బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్న సిట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజ్ కేసు నిందితులను ఐదో రోజు సిట్ ప్రశ్నిస్తుంది. సిట్ నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ప్రధాన నిందితులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ బ్యాంక్, రేణుక, డాక్యా నాయక్ దంపతుల ఖాతాలను పరిశీలిస్తున్నారు. కొంత కాలంగా జరిగిన లావాదేవీలపై సిట్ ఆరా తీస్తుంది. నిందితుల ఫోన్‌కాల్స్ డేటా వివరాలపైనా సిట్ దృష్టి పెట్టింది.

సోమవారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర లక్ష్మిని సిట్ విచారించింది. శంకర లక్ష్మి నుంచి కొన్ని వివరాలను సిట్ సేకరించడంతో పాటు ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్‌ను లోతుగా ప్రశ్నిస్తున్నారు. టిఎస్‌పిఎస్‌సిలో మరికొందరు సిబ్బందికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. టిఎస్‌పిఎస్‌సిలో ఎనిమిది మంది సిబ్బంది గ్రూప్-వ పరీక్ష రాయడంతో వారికి సిట్ నోటీసులు ఇవ్వనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News