Wednesday, January 22, 2025

ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి: సుప్రీం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: టిడిపి నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు ప్రశ్నలు వేసింది. గత ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటని అడిగింది. సిట్ నివేదకి వచ్చే వరకు ఆగలేరా అని సుప్రీం ప్రశ్నించింది. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అవకవతవకలపై సిటి విచారణకు ఎపి ప్రభుత్వం ఆదేశించింది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టులో ఎపి ప్రభుత్వం సవాల్ చేసింది. ఎపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తాము కోరామన్నారు. దర్యాప్తు చేయవద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని సింఘ్వీ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News