Monday, January 20, 2025

ప్రజ్వల్ కోసం విదేశాలకు సిట్ వెళ్లడం లేదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర.. రాజకీయ పార్టీలు, నేతలకు ఆదివారం కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్టా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కానీ, సమాచారం కానీ షేర్ చేయవద్దని కోరారు. ప్రజ్వల్‌ను వెనక్కు రప్పించేందుకు దర్యాప్తు బృందం సిట్ విదేశాలకు వెళ్లడం లేదన్నారు. అతనికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్ పోల్ పంచుకుంటుందని తెలిపారు.

బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చినందున ప్రజ్వల్ ఎక్కడ కనిపించినా సంబంధిత దేశాలు ఇంటర్ పోల్‌కు సమాచారం ఇస్తాయని చెప్పారు. అప్పుడు మన ఏజెన్సీలు, సిబిఐకి సమాచారం తెలుస్తుందని, వారి ద్వారా తమకు సమాచారం అందుతుందని చెప్పారు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున, అది పూర్తయ్యేవరకు ఎలాంటి సమాచారం బహిర్గతం చేయలేమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News