Monday, December 23, 2024

42మంది ఉద్యోగులకు సిట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీకేజీ వ్యవహారం రా ష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టిఎస్‌పిఎస్‌సి స్కాంలో సిట్ దూ కుడు పెంచింది. టిఎస్‌పిఎస్‌సి లో పనిచేస్తూ గ్రూప్1 పేపర్ లీక్ చేసిన ముగ్గురిని సిట్ గు ర్తించింది. ఈ వ్యవహారంలో ఈ ముగ్గురి పాత్రకు సంబంధించి ఆధారాలు సైతం సేకరించింది. వీరు ముగ్గురు గ్రూప్1 ప రీక్ష రాసి ర్యాంక్‌లు సంపాదించారు. వీరి ముగ్గురిపై కేసులు నమోదు చేసిన సిట్ వీరికోసం తీవ్రంగా గాలిస్తోంది. ఇదిలాఉంటే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి మరికొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రధానంగా రెడ్డి స్నేహితుడు సురేశ్ పాత్ర పై సిట్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టిఎస్‌పిఎస్‌సి నుంచి ఇతనే పేపర్‌ను బయటకు తీసుకొచ్చినట్లుగా తె లుస్తోంది. దీంతో సురేశ్ ఎం తమందికి పేపర్ ఇచ్చాడ నే దానిపై సిట్ ఆరా తీ స్తోంది.

ప్రవీణ్, రాజశేఖర్‌ల పెన్‌డ్రైవ్ల్‌లో సమాచా రం లీకైనట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ వాట్సాప్ చా ట్‌పై ఆరా తీసింది. అలా గే టిఎస్‌పిఎస్‌సిలో పనిచేస్తున్న 42మందికి సిట్ అధికారు లు నోటీసులు ఇచ్చారు. బుధవారం 9మంది నిందితుల ను 7 గంటల పాటు సిట్ ప్రశ్నించింది . దీనితో పాటు పలు అంశాలపై ఆధారాలను సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్ సేకరించింది. మరోవైపు ఈ కే సులో అరెస్టైన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్, రే ణుక ఆమె భర్త ఢాక్యానాయక్ బ్యాంకు ఖాతాల ను సిట్ బృందం పరిశీలించింది. ఇటీవల కాలంలో ఈ నిందితుల ఖాతాల్లో అనుమానాస్పద లా వాదేవీలు జరిగాయా? అనే కోణంలో కూడా సిట్ ఆరా తీ స్తోంది. ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డి ఇచ్చి న సమాచారం ఆధారంగా సురేశ్‌ను కూడా సిట్ అ ధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ విచారిస్తున్న సురేశ్‌కు గ్రూప్-1 పరీక్షలో 100 మా ర్కు లు వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

టిఎస్‌పిఎస్‌సి ప్ర శ్నాపత్రం విక్రయించి రేణుక డబ్బులు సంపాదించింద ని గుర్తించింది. నీలేష్, గోపాల్ లకు ప్రశ్నాపత్రాలు ఇచ్చి 14 లక్షలను రేణుక తీసుకుందని గుర్తించింది. టిఎస్‌పిఎస్‌సి కాన్పిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండ్ శంకర్‌లక్ష్మిని సిట్ అధికారులు మంగళవారం రాత్రి విచారించారు. శంకరలక్ష్మీ ఇచ్చిన స మాచారం మేరకు ప్రవీణ్‌ను సిట్ అధికారులు ప్ర శ్నించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ల నుంచి పెన్ డ్రైవ్‌లను సిట్ బృందం సీజ్ చేసింది. ఈ పెన్ డ్రైవ్ లలో ప్రశ్నాపత్రాలు ఉన్నట్టుగా సిట్ బృందం గు ర్తించింది. లీకేజీ సూత్రధారి ప్రవీణ్‌తో పాటు సంస్థ లో పనిచేస్తున్న మరో పదిమంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినట్లు సిట్ విచారణలో బయటపడింది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.

ఈ పదిమంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావడం గమనార్హం.. అయితే, గ్రూప్ 1 రాయడానికి వీరు కమిషన్ అధికారుల అనుమతి తీసుకున్నారా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ పరీక్ష రాయడానికి సెలవు పెట్టారా? లేక ఉద్యోగం చేస్తూనే పరీక్షకు హాజరయ్యారా? అనేది తెలియాల్సి ఉంది.పేపర్ లీకేజీపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఇప్పటికే తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్నించే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కమిషన్ ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్ష రాయడం, ఏకంగా పదిమంది మెయిన్స్ కు అర్హత సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వారంతా సొంతంగా చదివి పరీక్ష రాశారా? లేక గ్రూప్ 1 పేపర్ ముందే అందుకోవడం వల్ల పరీక్ష పాసయ్యారా? అనేది తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పరీక్ష రాసిన ఆ పదిమందినీ విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే బుధవారం సిట్ నోటీసులు జారీ చేసిన వారిలో ఈ పదిమంది కూడా ఉన్నట్లు సమాచారం.
కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు, అభ్యర్థులకూ నోటీసులు?
నిందితులు ఎవరేవరికి కాల్స్ చేశారనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులకు.. రేణుక, ఢాక్యానాయక్‌లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు. అయితే రేణుకా కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు
టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీక్ పై నిందితుడు రాజశేఖర్ తల్లి
అయితే ప్రధాన నిందితుల్లో ఒకడయిన రాజశేఖర్ తల్లి మాత్రం తన కొడుకు ఏ తప్పూ చేయలేడని అంటోంది. తన కొడుకు ఏ నేరమూ చేయలేదని జైలు నుండి చల్లగా బయటకు రావాలని కోరుకుంటున్నానని రాజశేఖర్ తల్లి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో రాజశేఖర్ ఇంట్లో తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ఏం చేసినా అమ్మా ఇది అని కొడుకు చెప్పేవాడని పేపర్ లీకేజీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని రాజశేఖర్ తల్లి తెలిపారు. ఆరేళ్లు అప్ఘానిస్తాన్ లో వున్నాడని అప్పుడే ఇళ్లు కట్టుకున్నామని అన్నారు. విదేశాల నుండి తిరిగివచ్చాక ఎంతో కష్టపడి 2018 లో ఉద్యోగాన్ని సాధించాడని అప్పటినుండి భార్యాబిడ్డలతో హైదరాబాద్ వుంటున్నాడని అన్నారు. పేపర్ లీక్ తో తన కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని రాజశేఖర్ తల్లి స్పష్టం చేశారు.
సిట్ నోటీసులు అందలేదంటున్న బండి
సిట్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తనకు సిట్ నోటీసులు అందలేదన్నారు. సిట్ నోటీసులు అంటించిన ఇల్లు ఎవరిదో తనకు తెలియదన్నారు. సిట్ అంటే సిట్ స్టాండ్ అని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ సర్వసాధారణమని అంటున్నారని విమర్శలు చేశారు. అనేక సందర్భాల్లో సిట్ దర్యాప్తు చేశారన్నారు. కానీ ఒక్క సిట్ విచారణలో ఏం తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News