Saturday, November 16, 2024

సంతోష్‌కు మళ్లీ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో హైకోర్టులో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఎ సిఆర్‌పిసి కింద వాట్సాప్, ఈమెయిల్ ద్వారా నోటీసులు పం పాలని తెలిపింది. ప్రభుత్వం పూ ర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలని పేర్కొంది. కొనుగోలు కేసులో బుధవారం ఉదయం మొదట విచారణ చేపట్టగా, మధ్యాహ్నం తిరిగి ప్రా రంభించింది. హైకోర్టు బెంచ్ ముందుకు సుప్రీంకోర్టు తీర్పు కాపీ చేరింది. బిజెపి తరపున మ హేష్ జెఠ్మాలానీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్ర సాద్ వాదించారు.

సుప్రీంకోర్టు ఎక్కడా దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. కేసు తో సంబంధం ఉన్నవాళ్లు ఎ వరైనా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇ చ్చినా ఇప్పటి వరకు బీఎల్ సంతోష్ సహకరించడం లే దని, 41ఎ సిఆర్‌పిసి ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. బీఎల్ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని మహేష్ జె ఠ్మాలానీ కోర్టుకు తెలిపారు. ఎప్పటి వరకు సమ యం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 29న నివేదిక సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉందని ఏజీ పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కానీ నేపథ్యంలో విచారణ ఆలస్యం అవుతుందని, తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

వృత్తిపరంగా వాదించాలి : లాయర్లకు హైకోర్టు సూచన

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ వ్యక్తుల్లా కాకుండా వృత్తిపరంగా వాదించాలని లాయర్లకు సూచించింది. ఈ కేసులో నిందితులకు ఇచ్చిన 41ఎ సిఆర్‌పిసి నోటీసులపై బుధవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాలేదని ఏజీ ప్రసాద్ కోర్టుకు వివరించారు. ఇతర పనుల్లో ఉండడం వల్లే హాజరు కాలేదని బి.ఎల్. సంతోష్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. ఇతర పనులున్నాయని చెప్పడం సరైన సమాధానం కాదని ఏజీ అన్నారు.

సాక్ష్యాల తారుమారుకే ఆలస్యం చేస్తున్నారని ఏఏజీ రామచంద్రరావు ఆరోపించారు. సంతోష్ అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నారని బిజెపి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కొంత సమయం కావాలని సంతోష్ సిట్‌కు లేఖ రాశారని తెలిపారు. 41ఎ నోటీసులను సవాల్ చేయాలనుకుంటే సంతోష్ నేరుగా హైకోర్టును ఆశ్రయించొచ్చని జడ్జి సూచించారు. సంతోష్‌తో మాట్లాడి కోర్టుకు చెబుతామని బిజెపి తరఫు న్యాయవాది రామచందర్ రావు తెలిపారు. ఎఎజి, రామచందర్ రావు వాదిస్తుండగా హైకోర్టు జడ్జి జోక్యం చేసుకున్నారు. టిఆర్‌ఎస్, బిజెపి న్యాయవాదుల్లా కాకుండా వృత్తిపరంగా వాదించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News