Sunday, April 13, 2025

బిజెపి ప్రభుత్వంపై 40 శాతం కమిషన్ ఆరోపణపై సిట్ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -
  • కర్నాటక మంత్రివర్గ నిర్ణయం
  • రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక

బెంగళూరు : జస్టిస్ నాగమోహన్ దాస్ కమిషన్ దర్యాప్తు నివేదిక నేపథ్యంలో కర్నాటకలో పూర్వపు బిజెపి ప్రభుత్వంపై వచ్చిన 40 శాతం కమిషన్ ఆరోపణలపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించింది. సిట్ రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని కర్నాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ విలేకరులతో చెప్పారు. ఆ తరువాత దర్యాప్తు నివేదికను మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెడతారు. మూడు లక్షల పనుల్లో నమూనాగా 1729 పనులపై జస్టిస్ నాగమోహన్‌దాస్ కమిషన్ దర్యాప్తు నిర్వహించిందని మంత్రి వెల్లడించారు. ‘ఆ నివేదిక రెండు సంపుటాల్లో ఉంది. అది అవకతవకల ఆరోపణలను ధ్రువీకరించింది’ అని మంత్రి తెలియజేశారు. విడుదల చేసిన డబ్బు మంజూరు చేసిన మొత్తం కంటె ఎక్కువ అని, నిరభ్యంతర పత్రాన్ని ముందుగానే జారీ చేశారని, టెండర్ ప్రక్రియలో జోక్యం ఉందని పాటిల్ ఆరోపించారు. ‘సిట్‌లో క్షేత్రం నుంచి నిపుణులు ఉంటారు. సిట్ రెండు నెలల్లో తన నివేదిక సమర్పించవలసి ఉంది. జస్టిస్ నాగమోహన్ దాస్ చేపట్టిన 1729 శాంపిళ్లనే కాకుండా మొత్తం పనులపై దర్యాప్తు జరుపుతుంది’ అని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News