- Advertisement -
లఖింపూర్ ఖేరీ : ఉత్తరప్రదేశ్‌లో రైతులపై హింసాత్మక చర్యల ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడు అశిష్ మిశ్రాను , మరో ముగ్గురిని గురువారం ఘటనాస్థలికి తీసుకువెళ్లారు. ఈ కేసుకు సంబంధించి అశిష్ అరెస్టు అయ్యారు. కేసు విచారణలో భాగంగా ఘటన జరిగిన టికోనియా గ్రామం వద్దకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను విచారణ ప్రక్రియలో కీలకమైన సీన్ రిక్రియెట్‌కు తీసుకువెళ్లింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీరిని టికోనియా బాన్‌బిర్‌పూర్ రోడ్డు వద్దకు తీసుకువెళ్లారు. గురువారం ఉదయం సిట్ వర్గాలు జిల్లా జైలుకు చేరుకున్నాయి. అందరిని తీసుకుని రిక్రియేట్ ఘట్టానికి వెళ్లాయి. మిశ్రా, అంకిత్‌దాస్, లతీఫ్ అలియాస్ కాలే, శేఖర్ భారతీలను తీసుకవెళ్లి ఘటన క్రమపు పూర్వాపరాలను రాబట్టుకునే దర్యాప్తు తంతు ముగించారు.
- Advertisement -