సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా… ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ పాత్రికేయు లు పల్లె రవికుమార్ అతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ “ఇదొక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. అందరూ రామాయణం కథ వినే ఉంటా రు. రాముడు తండ్రికి, భార్య (సీత)కు దూరమయ్యాడు. రావణాసురుడు సీతను అపహరిస్తే… అతడితో యుద్ధం చేసిన రాముడు భార్య ను వెనక్కి తెచ్చుకున్నాడు. రాముడికి హనుమంతుడు, వాలి, సుగ్రీవులు సపోర్ట్ చేశారు. అందు లో జనకుడి పాత్ర ఎక్కడైనా కనపడిందా? సీత తండ్రిగా ఆయన ఏం చేశారు? ఈ పాయింట్ బేస్ చేసుకుని… నల్గొండలో జరిగిన ప్రణయ్, – అమృత ప్రేమ కథ, మారుతి రావు ఇష్యూ మేళవించి ఫిక్షనల్ స్టోరీ రాశా”అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచాల యుగంధర్, మామిడి హరికృష్ణ, సుమన్, గరీమ చౌహన్, చరణ్ అర్జున్, ప్రవీణ్ వనమాలి పాల్గొన్నారు.