దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. ఆగస్ట్ 5న ‘సీతారామం’ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ’సీతారామం’ థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, అశ్వినీదత్ పాల్గొన్నారు. ఈ వేడుకలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హను ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ ఇది. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. చివరి ప్రేమకథగా ‘సీతారామం’ లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. సీతగా మృణాల్ అద్భుతంగా చేసింది. రష్మిక పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది”అని అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ “సీతారామం సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు”అని తెలిపారు. అశ్వినీదత్ మాట్లాడుతూ “దుల్కర్, సుమంత్, మృణాల్, రష్మికతో పాటు సినిమా యూనిట్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కరోనా ఉదృతంగా వున్న సమయంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా లాంటి ప్రదేశాల్లో సాహసించి షూటింగ్ చేశారు”అని పేర్కొన్నారు.
Sita Ram Movie Trailer Out