Sunday, December 22, 2024

మే 9న ‘సీతా రామం’ ఫస్ట్ సింగిల్

- Advertisement -
- Advertisement -

'Sita Ramam' first single on May 9

 

వెండితెరపై మర్చిపోలేని ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథ ” సీతా రామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఓ సీతా- హే రామా’ మే 9న   విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ వర్షంలో తడుచుకుంటూ హీరోయిన్ మృణాళినిని ఫాలో అవుతున్న విజువల్  ఆకట్టుకుంది. ఈ లవ్లీ పోస్టర్ ప్రకారం.. ఈ పాట ప్లజంట్ రొమాంటిక్ నంబర్‌గా ఉండబోతోందని అర్ధమౌతుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News