Sunday, December 22, 2024

లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించిన సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీ లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు మంత్రి సీతక్క జీరో బిల్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

సఫాయి నగర్ లో నివాసం ఉంటున్న జన్ను స్వరూప  సర్వీస్ కనెక్షన్ నెం: 10701-03583 వినియోగించిన యూనిట్లు: 128, మొత్తం: రూ 608 రూపాయలు కాగా బి కొమురైజ్ సర్వీస్ కనెక్షన్ నెం: 10701-02038 వినియోగించిన యూనిట్లు: 60, మొత్తం: రూ 233 రూపాయలుగా వచ్చాయి. గృహ జ్యోతి సబ్సిడీ క్రింద కరెంట్ బిల్ ప్రభుత్వం చెల్లించి జీరో బిల్లులను వారికి అందించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని సీతక్క పేర్కొన్నారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని తెలియజేశారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని సీతక్క వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఎఇ మల్చుర్, డిఇ నాగేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News