Wednesday, April 2, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ కు కుటుంబ ప్రేక్షకుల బ్రహ్మరథం

- Advertisement -
- Advertisement -

వేసవిలో వినోదాన్ని పంచడానికి థియేటర్లలో అడుగుపెట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. బ్లాక్‌బస్టర్ చిత్రం ’మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ’మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తూ .. మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

ఈ నేపథ్యంలో మీడియాతో దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ “మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి యువత, కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సునీల్, మురళీధర్‌లకు మధ్య వచ్చే సన్నివేశాలను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఆంథోనీ క్యారెక్టర్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది. మా సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ కలెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. రవితేజతో చేయబోయే సూపర్ హీరో సినిమాలో ఖచ్చితంగా కామెడీ ఉంటుంది. అలాగే సినిమా కొత్తగా ఉంటుంది. సూపర్ హీరోకి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. పూర్తిగా ఫిక్షన్ మూవీ”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News