హైదరాబాద్: దుబాయ్ కేంద్రంగా ప్రముఖ అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ ఆంధ్ర, తెలంగాణలో ఈ సంవత్సరము చివరి వరకు మాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ 82 చేరనుంది. దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానుండగా, వినియోగదారులను ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి తక్కువ ధరకె లక్ష్యంగా నెల రోజుల పాటు మ్యాక్స్ ఈ వేడుకలకు సిద్ధమైంది. హార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న కెపిహెచ్ బి నెక్సస్ మాల్‌లో 30 x 40 అడుగుల భారీ బొమ్మల కొలువును ప్రారంభించింది. దీనితో పాటుగా మ్యాక్స్ ఈ పండుగ సీజన్‌లో బహుమతులు కొన్ని వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలను భాగస్వామ్యం చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేని ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. 150కి పైగా మానీక్విన్స్ (బొమ్మలు) తో కూడిన బొమ్మల కొలువును ఆవిష్కరించారు. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను వివరిస్తుంది, మ్యాక్స్ యొక్క తాజా పండుగ కలెక్షన్ తో ఇవి అలంకరించబడ్డాయి. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ ఎన్జీవోల నుండి పిల్లలు, వృద్ధులకు దసరా కానుకలను అందజేయటం జరిగింది.
ఈ సందర్భంగా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మ్యాక్స్ ఫ్యాషన్- ఇండియా వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ హెడ్ పల్లవి పాండే మాట్లాడుతూ.. “అతిపెద్ద బొమ్మల కొలువు, దసరా పెస్టివల్ ఆఫర్స్ ను ప్రారంభించడం ద్వారా, మా కస్టమర్‌లకు షాపింగ్‌కు మంచి సంతోషాన్ని అందించడమే మా ప్రయత్నం. రోజువారీ ఫ్యాషన్ కోసం సాంప్రదాయ, లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు అందించిడమే మా లక్ష్యం” అని అన్నారు.
నగరంలో ఈ వేడుకను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. హైదరాబాద్ మాకు చాలా ప్రత్యేకం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మా అమ్మకాలలో 64% ఈ నగరం నుండి వస్తున్నాయి. మేము మరింత మంది కస్టమర్లకు సేవలందించేందుకు, వారి పండుగ వేడుకల్లో అంతర్భాగంగా మారేందుకు ఎదురుచూస్తున్నాము” అని మ్యాక్స్ ఫ్యాషన్ రీజినల్ బిజినెస్ హెడ్ పెద్దిరాజు ఆనంద్ రామ్ తెలిపారు.