Saturday, December 21, 2024

స్ట్రెస్ రిలీఫ్‌నిచ్చే సినిమా సీతారాం సిత్రాలు

- Advertisement -
- Advertisement -

లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా సీతా రాం సిత్రాలు. ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా ఈనెల 30న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు సినిమా నచ్చితే తమ భుజాల పైన వేసుకుని ముందుకు తీసుకెళ్తారు. ఈ సినిమా కూడా అందరూ చూసి ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాతలు పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు మాట్లాడుతూ.. ‘సీతారాం సిత్రాలు’లో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇది తమ సొంత సినిమా లాగా కష్టపడి పనిచేశారు. ప్రేక్షకులు అందరూ ఈ చిన్న సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. డైరెక్టర్ డి.నాగ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ 2019 కోవిడ్ వచ్చిన తర్వాత మెంటల్ స్ట్రెస్‌కి జనాలు ఎక్కువ గురయ్యారు. ఆ కోవిడ్ టైంలో ఎక్కువ స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చింది సినిమాలే. నేను జంధ్యాల, ఈవివి సత్యనారాయణ, రేలంగి గార్ల సినిమాలు ఎక్కువ చూశాను. మా ఈ సీతారాం సిత్రాలు సినిమా కూడా అలాంటి స్ట్రెస్ రిలీఫ్ సినిమా అవుతుంది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో లక్ష్మణ మూర్తి రతన, హీరోయిన్ భ్రమరాంబిక, కిషోరి ధాత్రక్, ఆకెళ్ళ రాఘవేంద్ర, సందీప్ వారణాసి, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి వంజారి తదితరలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News