Sunday, December 22, 2024

ఎయిమ్స్‌లో సీతారాం ఏచూరీకి చికిత్స

- Advertisement -
- Advertisement -

ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని శనివారం పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్న ఏచూరి కోలుకుంటున్నారని వారు చెప్పారు. 72 ఏళ్ల సీతారాం ఏచూరి నుమోనియా తరహా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో గస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. ఆయన వ్యాధి వివరాలను ఆసుపత్రి వెల్లడించలేదు. ఆయన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్నారని సిపిఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఏచూరికి ఇటీవలే క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News