- Advertisement -
న్యూఢిల్లీ: సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం బాగా క్షీణించింది. ఏచూరిని ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు.
- Advertisement -