Friday, December 20, 2024

నేడు సీతరామ ట్రయల్ రన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఈ ప్రా జెక్టుకు చెందిన మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర నీటి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆగస్ట్ 15న ఆ మూడు పంప్ హౌస్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. బాగంగా ఈ ఆదివారం రోజు ట్రయిల్ రన్ మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్‌కు చెందిన మూడు పంప్ హౌస్‌ల ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతుల పై మంత్రి ఉత్తమ్ శనివారం స చివాలయంలో నీటి శాఖ అధికారులతో ప్రత్యే క సమీక్ష సమావేశం నిర్వహించారు. శా ఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాం త్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈ ఎన్సీ కే.శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పంప్ హౌస్‌ల ప్రారంభోత్సవం రోజు ఖమ్మం జిల్లా వైరా లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌కు గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల కేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని ఆయన వెల్లడించా రు. సీతారామ లిఫ్ట్ ఐరిగేషన్ నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సేద్యంలోకి తేవాలన్న రాష్ట్ర ప్ర భుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటి శాఖాధికారులు పనులను వేగవంతం చేయాలని అదేశించా రు. ప్రాజెక్ట్ నిర్మాణపు అనుమతులు చివరి దశకు చేరడంతో పాటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చేరిందని తెలిపారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తో పాటు కేంద్ర పర్యావరణం అటవీ శాఖాల అనుమతుల పై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆయన సూచించారు. అదే సమయంలో కాలువల నిర్మాణంలో అడ్డుగా ఉన్న రైల్వే క్రా సింగ్ ల వద్ద నిర్మాణం ఆగి పోకుండా ఉండేలా ఆ శాఖ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. 34.561, 37.551 కిలోమీటర్ల వద్ద ఉన్న క్రాసింగ్ ల విషయమై మంత్రి ఉత్తమ్ ప్రస్తావిస్తూ రైల్వేశాఖతో చర్చించి ఆ శాఖ నిబంధనల మేరకు సత్వరం నిర్ణయం తీసుకోవాలన్నా రు.

ప్యాకేజ్ 1,2 లకు సరిపడా భూసేకరణను వెంటనే చేపట్టాలన్నారు. రెండు ప్యాకేజీల కు అవసరమయ్యే 3వేల ఎకరాల భూసేకరణ సత్వరమే చెప్పట్టగలిగేతే ని ర్దేశిత లక్ష్యానికి సకాలంలో చేరుకోగలుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మొత్తం త్వరితగతిన పూర్తి అయితే 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు, కొత్తగా రెండు లక్షల 60 వేల ఎకరాల ఆ యకట్టుకు సేద్యంలోకి వస్తున్నందున పనులు వేగం పెం చాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు ఉద్బోధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News