Thursday, July 4, 2024

పంద్రాగస్టుకు ఎన్కూర్ రెడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/హైదరాబాద్ : ఆగస్టు 15 నాటికి ఏన్కూరు లింకు కెనాల్‌ను పూ ర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్ల ను అందిస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క మల్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి గురువారం భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా, అశ్వాపురం మండలం, అమ్మగారిప ల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనుల ను, అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. అక్కడి నుంచి సీతారాయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్‌హౌస్ 1 వద్దకు చేరుకొని పనులను పరిశీలించిన అనంతరం విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఆ తర్వాత పంపుహౌస్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు,

ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేవలం రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత సర్కార్ ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామని అన్నారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్షంచామని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌ఎస్‌పిఎల్ కెనాల్‌కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఏన్కూర్ లింక్ కెనాల్ ను పూర్తి చేయడానికి 72 కోట్లు రూపాయలు మంజూరు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పంపుల ట్రయల్ రన్ చేయడానికి కావలసిన విద్యుత్ సరఫరా కోసం నిధులు ఇచ్చామని న్నారు. పంపుల ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌస్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు.

ఇరిగేషన్ సెక్టార్‌ను నాశనం చేసిన కెసిఆర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టార్‌ను గత ప్రభుత్వం కోలుకోలేని విధంగా ఆర్థికంగా చాలా నష్టం చేసిందని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 9,04,000 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేవలం 93,000 వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తీసుకువచ్చిందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గత ప్రభుత్వం ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9,000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఎకరం కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని అన్నారు. మొదలుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో పూర్తి చేయలేని అసమర్ధత ప్రభుత్వమని కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 2000 కోట్లతో పూర్తయి రాజీవ్ సాగర్‌ను సరైన కారణం లేకుండా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు అర్థం చేసుకోవాలని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గోదావరి నది జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. రీ డిజైన్ పేరిట తప్పుడు నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి ఆర్థిక భారం మోపినప్పటికీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖలో ఉన్న ఆటంకాలను తొలగించి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులకు మేలు జరిగే విధంగా భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రామసహాయ రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఎంఎల్‌లు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావ్, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్లు ప్రియాంక అల, విపి గౌతమ్, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News