Tuesday, January 21, 2025

హెచ్‌బి కాలనీలో సీతారామరాజు జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: మన్నెంవీరుడు అల్లూరి సీమరామారాజు 126వ జయంతి ఉత్సవాలు మీర్‌పేట్‌హెచ్‌బికాలనీ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని సీతరామారాజు విగ్రాహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవే ందర్‌రెడ్డితో కలసి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లూరి సీతరామారాజు తెల్లదొరలను ఎదురుకున్న తీరును వివరించారు. ఎంతో ధైర్య సాహసలతో పోరాడిన సీత రామారాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సుచించారు. మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, సూర్యచంద్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు జనంపల్లి వేంకటేశ్వర్‌రెడ్డి, బాల్‌రాజు, సుఖేందర్‌రెడ్డి, మ ల్లారెడ్డి, రామక్రిష్ణ, నవీన్‌గౌడ్, పూసరమేష్, చంద్రశేఖర్, రం గుప్రసాద్‌గౌడ్, రాజు,శ్రావన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News