Wednesday, January 22, 2025

నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 48వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 48వ వస్తువులు, సేవల పన్ను(జిఎస్‌టి) మండలి సమావేశాన్ని శనివారం న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను కూడా ఆమె చేశారు. ఈ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవి:

1. కొన్ని తప్పులను నేర రహితం చేయడానికి జిఎస్‌టి కౌన్సిల్ ఒప్పుకుంది. ప్రాసిక్యూషన్‌కు పరిమితిని రూ. 2 కోట్లకు పెంచింది. ఈ విషయాన్ని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
2. సమయాభావం వల్ల ఏజెండాలోని 15లో 8 అంశాలు మాత్రమే జిఎస్‌టి మండలి నిర్ణయిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్‌టి అప్పీలేట్ ట్రిబ్యూనల్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు.
3. పాన్ మసాలా, గుట్కా బిజినెస్‌లో పన్ను ఎగవేతను నిరోధించే యంత్రాంగానికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చకు తీసుకోలేదు.
4. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా అధ్యక్షతన మంత్రుల బృందం(జిఒఎం) రూపొందించిన నివేదిక కేవలం కొన్ని రోజుల క్రితమే అందినందున, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలపై జిఎస్‌టి అంశాన్ని చర్చించలేదని మల్హోత్రా తెలిపారు.
5. మంత్రుల బృందం నివేదిక సైతం జిఎస్‌టి కౌన్సిల్ సభ్యులకు సర్కూలేట్ కాలేదని మల్హోత్రా తెలిపారు.
6. పప్పుదినుసుల పొట్టుపై జిఎస్‌టిని 5 శాతం నుంచి 0కు తగ్గించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News