Sunday, December 22, 2024

21న బడ్జెట్-2023 పై సమావేశం

- Advertisement -
- Advertisement -
వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ, సలహాలు, సూచనలను తీసుకోనున్న నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : ఈ నెల 21న బడ్జెట్ 202324పై వివిధ రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. నాలుగు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆర్థిక మంత్రి మొత్తం ఏడు సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగే జిఎస్‌టి సమావేశంతోపాటు బడ్జెట్‌పై చర్చ జరుపనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రాల డిమాండ్లను తెలుసుకునేందుకు ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్ భేటీ నిర్వహిస్తారు.
నవంబర్ 21 నుండి 24 వరకు జరిగే ప్రీ-బడ్జెట్ సమావేశంలో సీతారామన్ పరిశ్రమలు, వ్యాపార చాంబర్లు, వ్యవసాయ రంగం, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్లు, సామాజిక రంగం, సేవలు, వాణిజ్యం ప్రతినిధులతో హాజరుకానున్నారు.

కార్మిక సంఘాలు, కార్మికులు, సంస్థతో పాటు, ఆర్థికవేత్తలతో సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌కు సంబంధించి వారి సూచనలను తీసుకుంటారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ముందు ఆర్థికమంత్రి వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఉన్నత అధికారులు, ముఖ్య ఆర్థిక సలహాదారుతో సమావేశమై వారి సూచనలను స్వీకరిస్తారు. దీంతో పాటు అన్ని రంగాల ప్రతినిధులు ఆర్థికమంత్రికి తమ సూచనల లేఖలను సమర్పిస్తారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ఐదో బడ్జెట్‌ను 2023 ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంపై ఈసారి బడ్జెట్‌లో దృష్టి కేంద్రీకరించబోతున్నట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News