న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలను సిత్రాంగ్ తుఫాన్ వణికిస్తోంది. అసోం, పశ్చిమబెంగాల్ సహా మేఘాలయ, మిజోరంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. నాలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్డ్ జారీ చేశారు. సోమవారం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించిన తుపాన్ అక్కడ దాదాపు 11 మందిని బలిగొంది. అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. మరోవైపు ఈ ప్రాంతాల్లో గంటకు 110 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం లోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గౌహతిలో మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలని బెంగాల్ సిఎం మమతాబెనర్జీ కోరారు. 24 పరగణాల జిల్లా లోని బక్హాలీ బీచ్‌లో ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. మంగళవారం తెల్లవారు జామున బంగ్లాదేశ్ తీరం వద్ద తినాకోనా ద్వీపం, బరిసాల్ సమీపంలో శాండ్‌విచ్ మధ్య తుపాన్ దాటింది.
ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న సిత్రాంగ్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -