Monday, December 23, 2024

సిత్రాంగ్ తుపాను ఎఫెక్ట్.!

- Advertisement -
- Advertisement -

Sitrang Typhoon Effect

హైదరాబాద్: సిత్రాంగ్ తుపానుతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. అక్టోబర్ 28 రాత్రి నుంచి ఎపి, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురసే అవకాశం ఉంది.

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎపి, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఎపి, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాల కాలం ముగియడంతో ఈశాన్య రుతుపవనాలతోనే వర్షాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News