Wednesday, January 22, 2025

‘ఆదికేశవ’ నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

జాతీయ అవార్డు గెలుచుకున్న ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ‘ఆదికేశవ’ అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. యువ సంచలనం శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. అపర్ణా దాస్, జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ స్వరకర్త, జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే మొదటి పాటను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.

నాయకానాయికల మధ్య సాగే మెలోడీ పాట ఇది. కథానాయకుడు వైష్ణవ్ తేజ్ తన చిత్ర(కథానాయిక శ్రీలీల)ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. గేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి, అందమైన పదాల అమరికతో పాటకు ప్రాణం పోశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ‘నాటు నాటు’ పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించారు. గాయని రమ్య బెహరా పాటలోని అనుభూతిని తన స్వరంలో చక్కగా పలికించారు. ఈ పాట వైరల్ అవుతుందని, పార్టీలలో మారుమ్రోగి పోవడం ఖాయమని అప్పుడే శ్రోతల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

థియేటర్లలో ప్రేక్షకులకు మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందించడానికి ఆదికేశవ టీమ్ కసరత్తు చేస్తోంది. ఈ చిత్రం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్న నిర్మాతలు, ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగిస్తామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News