న్యూస్ డెస్క్: వేగంగా వెళుతున్న కారు టాపు మీద కూర్చుని మద్యం తాగడం, పుష్ అప్స్ చేయడం వంటి ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన ఒక వ్యక్తిపై గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపించారు. తామేం తక్కువ తినలేదన్నట్లు అతని స్నేహితులు కూడా నడుస్తున్న కారు తలుపులు తీసుకుని కారు టాపు ఎక్కి చిందులు వేశారు. ఈ ప్రమాదకర విన్యాసాలను మరో వ్యక్తి వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్పందించిన గురుగ్రామ్ పోలీసులు కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కారు యజమానికికి జరిమానా విధించారు.
Also Read: ఎల్‌బి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం….
మొదటి వీడియో క్లిప్ 13 సెకండ్ల నిడివి ఉంది. తెల్ల షర్టు వేసుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి వేగంగా వెళుతున్న కారు టాపు మీద కూర్చుని బీరు తాగడం కనిపించింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఇరువైపులా రెండు ముందు డోర్లు తెరుచుకుని బయటకు రావడం ఈ వీడియోలో కనిపించింది.
27 సెకండ్ల నిడివి ఉన్న రెండో వీడియోలో.. తెల్ల షర్టు వేసుకున్న వ్యక్తి కారు టాపు మీద పుష్ అప్స్ చేయడం కనిపించింది. కారులోనుంచి మరో ముగ్గురు వ్యక్తులు టాపు మీదకు చేరుకుని డ్యాన్స్ చేయడం కనిపించింది. వీడియోలో కనిపించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా కారు యజమానిని హరీష్‌గా గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆ వ్యక్తికి రూ. 6,500 జరిమానా విధించారు. ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, వారు ప్రమాదంలో పడడమే కాక రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెట్టే ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిసిపి వీరేందర్ విజ్ ట్వీట్ చేశారు.
They have no fear of anyone's life and neither of Gurgaon trafficpolice @TrafficGGM
Vichle no HR72F6692@DC_Gurugram @TrafficGGM@cmohry @gurgaonpolice pic.twitter.com/pM2NeypUdR— Pradeepdubey (@dubey_100) May 30, 2023
Also Read: షరతులతో అవినాష్‌కు బెయిల్