Wednesday, January 22, 2025

ఆ 2500 మంది… వేల ప్రశ్నలు

- Advertisement -
- Advertisement -

Situation of 2,500 Ukrainian military fighters is worrying

ఉక్రెయిన్ యోధుల జాడ ఏదీ ?
రష్యా యుద్ధ ఖైదీలుగా ఉన్నారా లేరా?
విజయంపై చెప్పి వీరిపై మాస్కో సస్పెన్స్

కీవ్ : ఉక్రెయిన్‌లో ఇప్పుడు దాదాపు 2,500 మంది ఉక్రెయినీ సైనిక యోధుల పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరం అయింది. మిగిలిన ఏకైక ప్రధాన నగరం మేరియూపోల్‌ను పూర్తి స్థాయిలో రష్యా సైనికుల కైవసం కాకుండా అక్కడి సువిశాల ఆవరణపు స్టీల్‌ప్లాంట్‌లో నెలల తరబడి మకాం వేసి ఈ ఫైటర్లు రష్యా దళాలను ప్రతిఘటించారు. అయితే వీరిని తాము ఖైదీలుగా బందీలుగా తీసుకువెళ్లామని ఇప్పుడు రష్యా తెలిపింది. అయితే వీరిని యుద్ధ ఖైదీలుగా మార్చి ట్రిబ్యునల్స్ విచారణకు అప్పగించేలా చేస్తామని మాస్కో మద్దతు ఉన్న స్థానిక వేర్పాటువాద సంస్థ నేత ఒకరు తెలిపారు. అయితే ఇంతకూ ఈ సైనికులు క్షేమంగా ఉన్నారా? చిత్రహింసలకు గురి అవుతున్నారా? వీరి ప్రస్తుత దశ ఏమిటీ? వీరు ఎక్కడున్నారు? సురక్షితమేనా అనే పలు ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. మేరియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ ఫైటర్ల ప్రతిఘటనకు కేంద్రంగా నిలిచింది. మేరియూపోల్ రష్యాకు అత్యంత అవసరం అయిన వ్యూహాత్మక కీలక రేవు పట్టణం. ఇక్కడి నుంచి రక్షణపరంగా పలు మార్గాలను ఎంచుకుని పూర్తి స్థాయిలో ఉక్రెయిన్‌ను తమ ఆధీనంలోకి తీసుకురావచ్చునని రష్యా చకచకా పావులు కదిపింది.

అయితే ఈ చర్యలను ఇక్కడి సైనిక బలగాలు చాలా కాలం పాటు నిలువరించాయి. ఈ స్టీల్‌ప్లాంట్‌ను తాము స్వాధీనం చేసుకున్నామని రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా విధ్వంసానికి ప్రతీక అయిన ఈ నగరంలోని శిథిలాలు ఇక్కడ దాదాపు 20వేల మంది పౌరుల బలి విషాదగాధకు సజీవ సాక్షంగా నిలిచింది. మూడు నెలల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆరంభించిన తరువాత పుతిన్ కోరుకున్న సంపూర్ణ స్థాయి ఉక్రెయిన్ ఆధిపత్యం ఇప్పుడు మేరియూపోల్ స్వాధీనంతో నెరవేరింది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో అధికారికంగా ఉక్రెయిన్ రష్యా చేతుల్లోకి రాలేదు. పశ్చిమ కీలక దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నాయి.

పోలెండ్ అధ్యక్షులు అండ్కెజెజ్ డుడా ఉక్రెయిన్‌లోని ఓ రహస్య స్థావరానికి ఉన్నట్లుండి వచ్చారు. ఆదివారమే ఆయన దేశ పార్లమెంట్‌ను ఉద్ధేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు తమ దేశం ఇతర దేశాల మద్దతు ఉంటుందని ప్రతిఘటన సాగాల్సిందే అని ఆయన సందేశం ఇచ్చారు. ఇదే దశలో ఉక్రెయిన్ సైనికులు మేరియూపోల్‌లో తమ బందీలుగా ఉన్నట్లు తెలిపే వీడియో దృశ్యాలను రష్యా ఇప్పుడు వెలువరించింది. విస్తారిత కందకాల నుంచి తాము వేలాదిగా ఉక్రెయిన్ సైనికులను బయటకు రప్పించినట్లు వారిని బందీలుగా తీసుకువెళ్లినట్లు రష్యా తెలిపింది. వీరి బందీ గురించి తెలిపిన రష్యా ఇప్పుడు వీరు క్షేమంగా ఉన్నారా ? లేదా అనే విషయాన్ని మాటమాత్రంగా కూడా తెలియచేయలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News