Thursday, December 26, 2024

ద్విభాష చిత్రం

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌తో తెలుగు, తమిళ ద్విభాష చిత్రాన్ని ప్రకటించారు నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, సురేష్ బాబు. శివ కార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్ పి, శాంతి టాకీస్ బ్యానర్స్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ‘జాతి రత్నాలు’వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు అనుదీప్ కెవి రూపొందిస్తున్న చిత్రమిది. యుకెలోని లండన్, మన దేశంలోని పాండిచ్చేరి నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగనుంది. పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News