Sunday, December 22, 2024

ఏఆర్ మురుగదాస్-శివ కార్తికేయన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ..

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, హీరో శివకార్తికేయన్‌ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టును శ్రీ లక్ష్మి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ మూవీ శివకార్తికేయన్ కు 23వ చిత్రం. దర్శకుడు మురుగదాస్ పుట్టినరోజున సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ ప్రకటించారు.

హీరో శివకార్తికేయన్, దర్శకుడు ఎఆర్ మురుగదాస్‌తో కలిసి ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తూ..“డియర్  మురుగదాస్ సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిత్రం నాకు అన్ని విధాలా చాలా ప్రత్యేకమైనది. చిత్రీకరణ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ” అని పేర్కొన్నారు. దీనిపై ఏఆర్ మురుగదాస్ స్పందిస్తూ.. “థాంక్యూ సో మచ్ శివా. మీతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో చేరినందుకు ఆనందంగా ఉంది. కలిసి సినిమాటిక్ మ్యాజిక్‌ను సృష్టిద్దాం’ అని అన్నారు. ప్రస్తుతం, ప్రీప్రొడక్షన్ దశలో ఈ చిత్రంలో నటీనటులు, ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News