Monday, December 23, 2024

చంపేస్తారనే భయంతో చెట్టుకు ఉరేసుకున్నాడు…

- Advertisement -
- Advertisement -

Siwan man fearing murder found dead
పాట్నా: చంపేస్తారనే భయంతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్న సంఘటన బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా దరోండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజా కుమార్- కల్పనాదేవి అనే దంపతులు ఎంహెచ్ నగర్ పోలీస్ స్టేషన్ పరధిలోని అరండా ప్రాంతంలో నివసించేవారు. గత కొన్ని రోజుల క్రితం కల్పనా దేవి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె తల్లిదండ్రులు తన అల్లుడే చంపి ఉంటాడని భావించారు. అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తన గ్రామ నుంచి అతడు పారిపోయాడు. ఎలాగైనా తన అత్తింటి వారు చంపుతారనే భయం అతడిని వెంటాడింది. తనని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో పాటు హింసించారని, వారి నుంచి తప్పించుకొని ఒక స్థలంలో దాక్కున్నానని సోషల్ మీడియాలో తెలిపాడు. వాళ్లు తనని చంపుతారనే అనే భయంతో దనౌటి గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో రికార్డు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News