Monday, January 20, 2025

కార్లలో ఇకపై ఆరు ఎయిర్‌బ్యాగ్స్

- Advertisement -
- Advertisement -

Six Airbags rule in passenger cars

ప్రయాణ భద్రతకు కేంద్రం చర్య

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని ప్రయాణికుల కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనను పటిష్టంగా అమలుపరుస్తారు. ఈ మేరకు కేంద్ర రహదారులు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది. వాహనాల ధరలు పెరుగుతాయనే కారణంతో కార్ల తయారీదార్లు కొందరు ఈ ప్రాతిపదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రవాణా దశలో ప్రయాణికుల భద్రతపై రాజీ లేదని, ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిపై తమ మంత్రిత్వశాఖ నిబంధనలను రూపొందించే పనిలో ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో కొత్తగా వచ్చే కార్లన్నింటికి ఈ ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల అమరికను తప్పనసరి చేసే నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని జనవరిలోనే మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. ఇప్పుడు నిబంధనల ఖరారు ఈ నెలాఖరుకు పూర్తి అవుతుంది. అయితే ఆటో కంపెనీల అభిప్రాయాలను ఈలోగా తీసుకుంటారు. దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ ఒకటి ఇటీవలే ఈ ఎయిర్‌బ్యాగ్ నిబంధన సరికాదని పేర్కొంది. దీనితో చిన్నకార్లు మరింతగా ధరలు పల్కుతాయి. వీటి ధరలతో కొనుగోలుదార్లు ముందుకు రాని స్థితి ఏర్పడుతుందని, ఇది చివరికి ఆటో పరిశ్రమను దెబ్బతీస్తుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News