Sunday, December 22, 2024

నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్‌ల తయారీ..ఆరుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్‌ల తయారీకి పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్‌టిఎ ఎజెంట్ల గుట్టును బుధవారం రాచకొండ, ఎల్‌బీ నగర్ ఎస్వోటీ, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. వీరంతా విలాసవంతమైన జీవి తానికి డబ్బులు సరిపోవడం లేదని వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను ఇప్పించేందుకు నకిలీ ఇన్సూరెన్సు, ఆధార్ కార్డులు, పోలీసు మిస్సింగ్ సర్టిఫికేట్‌లను తయారీకి తెగబడ్డారు. అరెస్టు అయిన నిందితులు సంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, అడుశెట్టి వేణు, పుట్టబతిని శ్రీధర్, అనుపతి శ్రీశైలం, చాపల యాదగిరి, కొనగల ఆనంద్.

వీరంతాఒక ముఠాగా ఏర్పడి ట్రాన్స్‌పోర్ట్/నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ తయారు చేస్తూ అవసరమైన వారికి అందజేస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మన్నెగూడ వద్ద లక్ష్మి జిరాక్స్ షాప్ వద్ద ఉండగా పోలీసులు ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 74 నకిలీ ఇన్సూరెన్సు, ఆధార్, పోలీసు మిస్సింగ్ లెటర్స్, తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మందికి ఇలా నకిలీ సర్టిఫికేట్‌లు ఇచ్చారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నకిలీ సర్టిఫికేట్‌లను ముఠా సభ్యులు రూ.2 నుంచి 10 వేల వరకు విక్రయస్తూ డబ్బులు సంపాందించడం తో ఫిటినెస్ లేని వాహనాలను రోడ్లపై ప్రమాదభరితంగా తిరిగేలా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News