ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: నిషేధిత సట్టా నిర్వాహకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.35,580 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ఎండి అజ్‌మత్ అలీ తాపీ మేస్ట్రీగా పనిచేస్తున్నాడు, సట్టా నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు, ఎండి వాసిం ఖాన్, షేక్ దావుద్, అక్రం ఉద్దిన్, ఎండి అలీఖాన్, రాజు పంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన షేక్ సాధిక్ పరారీలో ఉన్నాడు. ఎండి అజ్జమత్ అలీ చేస్తున్న పనిలో వస్తున్న డబ్బులు సరిపోవడంలేదు. దీంతో సట్టా నిర్వహించాలని ప్లాన్ వేశాడు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడు షేక్ సాధిక్‌ను సంప్రదించాడు. నిర్వాహకుడు నగరంలో పంటర్లను నియమించుకుని డ్రైవర్లు, పాన్ వెండర్లు, వెజిటబుల్ వెండర్లు, హోటల్ వర్కర్లను టార్గెట్‌గా చేసుకుని సట్టా నిర్వహిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని వారిని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. వారి వద్ద సేకరించిన డబ్బులను మహారాష్ట్రలోని ప్రధాన నిర్వాహకుడికి పంపిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, శ్రీనయ్య తదితరులు పట్టుకున్నారు.