Thursday, October 24, 2024

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులు ఎక్సైజ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నాలుగు కేసుల్లో 7.058 కేజీల గంజాయి, 9గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ 1.5కిలోలు, గుడి మల్కాపూర్‌లో, నల్ల పోచమ్మ గుడిలో 1.308కిలోలు, ధూల్‌పేటలో 1.4కిలోలు, చందానగర్‌లో 2.850 కిలోలు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ సిబ్బంది చేసుకున్నారు. ధూల్‌పేటకు చెందిన భరత్‌సింగ్, గీతాబాయ్, క్రాంతి, నిరంజన్, డాన్ శీలాబాయ్, ఒరిస్సాకు చెందిన సుబాష్‌ను అరెస్టు చేశారు.

ఎండిఎంఎ డ్రగ్స్…
బెంగళూరు నుంచి బస్సుల్లో డ్రగ్స్‌ను తీసుకొని వచ్చిన డెలివరీ చేస్తున్న అజయ్‌కుమార్‌ను ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. అజయ్‌కుమార్ బెంగళూరు నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుని వచ్చి ఆర్డర్ ఇచ్చిన వారికి డెలివరీ చేస్తున్నాడు.ఈ విషయం తెలియడంతో ఎస్ టి ఎఫ్ సీఐ శిరిష బృందం లక్డికాపూల్ బస్‌స్టాప్ నిందితుడి కోసం వేచి ఉన్నారు. వెల్డర్‌గా పనిచేస్తున్న అజయ్‌కుమార్ బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సప్లయర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ తీసుకుని వచ్చి అతడు చెప్పిన వారికి డెలివరీ ఇస్తున్నాడు. దీనికి అజయ్‌కుమార్‌కు కమీషన్ ఇస్తున్నాడు.

బైక్‌పై గంజాయి సరఫరా…
బైక్‌పై గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని గొల్కొండ ఎక్సైజ్ ఎస్‌టిఎప్ టీం సభ్యులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రామ్‌దేవ్‌గూడ బస్‌స్టాప్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో గొల్కొండ ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ టీమ్ రామ్‌దేవ్‌గూడ బస్ స్టాప్ ప్రాంతంలో వేచి ఉన్నారు. బైక్‌పై వచ్చిన అలిజాపూర్‌కు చెందిన రాహుల్ సింగ్‌ను అరెస్టు చేసి బ్యాగును తనిఖీ చేయగా గంజాయి లభించింది. రెండు సెల్ ఫోన్లు , బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ సింగ్‌తో సంబంధలు ఉండడంతో ఆతడిపై కూడా కేసు నమోదు చేశారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News