Sunday, December 22, 2024

గంజాయి కేసులో ఆరుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న ఆరురుగు నిందితులను వెస్ట్, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 165 కిలోల గంజాయి, కార్లు, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రష్మిపెరుమాళ్ ఆదివారం సిసిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, పిట్లాంపిఎస్, కోర్నపల్లికి తండాకు చెందిన ధరావత్ రవి, మహారాష్ట్ర, నాందేడ్‌కు చెందిన సయిద్ బహదూర్, ఆనంద్ రాంజి కడం కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. కామారెడ్డికి చెందిన రవి గతంలో గంజాయి విక్రయిస్తుండగా మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రవి ఒడిసా రాష్ట్రం, ముచ్చుంపేటలో 100కిలో గంజాయిని గోవింద్ వద్ద కొనుగోలు చేసి నగరానికి కారులో తీసుకుని వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో టోలీచౌకిలోని పారామౌంట్ కాలనీ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం హుమాయున్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

మరో కేసులో భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 60కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన షేక్ పర్వేజ్, అబ్దుల్ రవూఫ్ అలియాస్ రవూఫ్, మహ్మద్ అన్వర్ కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన షేక్ పర్వేజ్ గతంలో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఒకటి ఎపిలోని రావులపాలెంలో, మరో కేసు లంగర్‌హౌస్‌లో నమోదైంది. ఒడిసారాష్ట్రం, కలిమేలాకు చెందిన దీపక్ వద్ద నిందితుడు గంజాయి కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నాడు. తన సాహయకులతో కలిసి ఆర్‌టిసి బస్సులో గంజాయిని నగరానికి తీసుకుని వస్తున్నాడు. దీనిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ బాలాస్వామి, ఎస్సై అజీత్ సింగ్ పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News