Sunday, December 22, 2024

బాలికల అక్రమ రవాణా కేసు ఆరుగురికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగ్లాదేశ్ బాలికలను అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన 2019 మా నవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌లో ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది. నిందితులు మహ్మద్ యూసుఫ్ ఖాన్, అతని భార్య బితీ బేగం, సోజిబ్, రుహుల్ అమీన్ ధాలీ, మహ్మద్ అబ్దుల్ సలామ్ అలియాస్ కౌన్లా జస్టిన్, షీలా జస్టిన్ అలియాస్ షియు లీ ఖాతున్‌లు అనైతిక ట్రాఫికింగ్ నిరోధక చ ట్టం, 1986, ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద దోషులుగా తేలారని ఎన్‌ఐఎ పేర్కొంది. ఆ రుగురు నిందితులలో ధాలీని పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేయగా, మిగతా వారిని 2019 20020 మధ్య తెలంగాణలో అరెస్టు చేశా రు. బుధవారం తన తీర్పులో ప్రత్యేక కోర్టు మొత్తం ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు,

రూ. ఒక్కొక్కరికి 24,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, నింది డికి అదనంగా 18 నెలల సాధారణ జైలు శిక్ష పడుతుంది. మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని బంగ్లాదేశ్‌కు చెందిన బాలికలను ప్రలోభపెట్టి, భారత్‌కు అక్రమంగా నిందితులు రవాణా చేశారని, ఆ తర్వాత వారిని వ్యభిచారంలోకి దింపారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఆగస్టు 2019లో జరిగిన ఆపరేషన్‌లో హైదరాబాద్‌లోని ఉప్పుగూడలోని కందికల్ గేట్ ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి ఐదుగురు బాలికలను రక్షించిన తర్వాత ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 సెప్టెంబర్ 17న కేసును మళ్లీ నమోదు చేస్తూ దర్యాప్తును ఎన్‌ఐఎ చేపట్టింది. 2020 మార్చి 10న నలుగురిపై ఎన్‌ఐఎ చార్జిషీట్‌ను దాఖలు చేసింది, ఆ తర్వాత ఆగస్టు 2020లో మిగిలిన ఇద్దరిపై అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News