Wednesday, January 22, 2025

ఒక ఓవర్లో ఐదు సిక్సర్లు.. ఆరుగురు హిట్టర్లు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో ఒక ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన ఘనత ఆరుగురు బ్యాటర్లు సొంతంచేసుకున్నారు. అరుదైన ఈ ఘనతను అందుకున్నవారిలో క్రిస్‌గేల్ తొలిస్థానంలో ఉన్నాడు. గేల్ 2012లో బెంగళూరు వేదికగా పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి తరఫున ఒకే ఓవర్లో ఐదు సిక్సర్ల ఘనత అందుకున్నాడు. రాహుల్ శర్మ బౌలింగ్‌లో గేల్ ఐదు సిక్సర్లు సాధించాడు.

ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 2020లో షార్జా వేదికగా రాయల్స్ తరఫున రాహుల్ తెవాతియా బౌలర్ షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు, 2021లో వేదికగా సిఎస్‌కె తరఫున రవీంద్ర జడేజా ఆర్‌సిబి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు, 2022లో పుణే వేదికగా తరఫున స్టొయినిస్, హోల్డర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ శివంమావి ఐదు సిక్సర్లు కొట్టగా, తాజాగా కేకేఆర్ బ్యాటర్ రింకూసింగ్ గుజరాత్ బౌలర యశ్ దయాల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లుతో రికార్డుల మోత మోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News