Monday, December 23, 2024

ఒడిశా బస్సు ప్రమాదంలో ఆరుగురు బెంగాల్ టూరిస్టుల మృతి

- Advertisement -
- Advertisement -

Six Bengal tourists killed in Odisha bus accident

భువనేశ్వర్ : ఒడిశాలో టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కంథమల్ జిల్లా లోని దరింగిబండి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వెళ్తుండగా మంగళవారం రాత్రి గంజామ్ కంధమల్ సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగిందని గంజాం ఎస్‌పీ బ్రిజేష్ రాయ్ తెలిపారు. బస్సులోని 77 మంది ప్రయాణికుల్లో 65 మంది పశ్చిమబెంగాల్ లోని హౌరా, హుగ్లీ జిల్లాలకు చెందిన వారేనని చెబుతున్నారు. మృతులు సుప్రియ డెన్రె (33), సంజీత్ పాత్ర ( 33 ) , రిమా డెన్రె ( 22 ) , మౌసుమి డెన్రె , బర్నాలీ మన్నా (34 ) , స్వపన్ గుషయిత్ ( 44 ) గా గుర్తించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News