Wednesday, January 22, 2025

రెండు గంటల్లోనే ఆరు చైన్ స్నాచింగ్ కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లు నమోదవడంతో నగర వాసులు భయాందోళనకు గురయ్యారు. ఉప్పల్‌లో రెండు, చిల్కగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, రాంగోపాల్‌పేటలో ఒక్కొక్కటి చొప్పున చైన్‌స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు హైఅలర్ట్‌ను పెంచి సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు దొంగిలించిన మోటార్‌సైకిళ్లను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News