అమరావతి: చదువుల సరస్వతి, చిచ్చరపిడుగు హేమశ్రీ చదువుతున్నది ఆరో తరగతి… తెలివి తేటలు, ఐక్యూ ఎక్కువగా ఉండడంతో పదో తరగతి బుక్‌లు అవలీలగా చదివేస్తుంది. ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెబుతుంది. బాలిక తెలివిన చూసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. వెంటనే విద్యాశాఖలో ఉన్న ఉన్నతాధికారులను కలిశారు. పదో తరగతి పరీక్షలు రాయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు ఓకే చెప్పడంతో పదో తరగతి పరీక్షలకు ఆ బాలికను సన్నదం చేశారు. పదో తరగతిలో ఆ బాలికకు 488 మార్కులు రావడంతో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో సురేష్-మణి అనే దంపతులకు హేమ శ్రీ అనే కూతురు ఉంది. గాంధీనగర్‌లో మహ్మాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. చదువులో అందరి కంటే ముందు ఉండడంతో పాటు పై తరగతుల బుక్స్ చదివి జవాబులు అవలీలగా చెబుతుండడంతో ఆమె చేత పదో తరగతి పరీక్షలు రాయించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 488 మార్కులు వచ్చాయి.
Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాస్థాన్‌తో కీలక పోరు