Monday, December 23, 2024

తప్పించుకోడానికి నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. పలువురికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. గర్భిణులను లక్ష్యంగా చేసుకుని న్యూట్రిషన్ ట్రాకర్ యాప్ ద్వారా మోసాలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లను పట్టుకోడానికి తీవ్రంగా గాలిస్తున్న పోలీస్‌లకు దొరక్కుండా నదిలో నిందితులు దూకిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోడానికి ఝార్ఖండ్ పోలీస్‌లు సాధారణ దుస్తులు ధరించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో బరాకర్ నదీ ప్రాంతం వద్ద గాలిస్తుండగా, ఆరుగురు అనుమానితులు పోలీస్‌లకు తారస పడ్డారు. వారిని పట్టుకోడానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న నదిలో నిందితులు ఆరుగురు దూకేశారు. దీంతో పోలీస్‌లు కూడా నదిని దాటి వారిని అరెస్ట్ చేయగలిగారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో అరెస్టయిన నిందితుల నుంచి రూ.8 లక్షలకు పైగా నగదు, 12 ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్ కార్డులు, 12 పాస్ పుస్తకాలు , కొన్ని పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News