Friday, November 15, 2024

సింఘూ సరిహద్దు హత్య కేసులో ముగ్గురికి ఆరు రోజుల పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

Six days police custody for 3 in Singhu border murder case

సోనీపత్: ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘూలో జరిగిన హత్య కేసులోని ముగ్గురు నిందితుల్ని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని నిందితులైన నారాయణ్‌సింగ్, భగవత్‌సింగ్, గోవింద్‌ప్రీత్‌సింగ్‌లను ఆదివారం సోనీపత్‌లోని కోర్టులో హాజరు పరచగా ఈ ఆదేశాలిచ్చింది. వీరితోపాటు సర్వజిత్‌సింగ్ అనే మరో వ్యక్తి సింఘూ సరిహద్దులో జరిగిన లఖ్‌బీర్‌సింగ్ హత్య కేసులో నిందితుడు. శుక్రవారం సాయంత్రమే సర్వజిత్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిహంగ్‌బాబాగా పేరున్న నారాయణ్‌సింగ్‌ను అమర్‌కోట్‌లో శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మిగతా ఇద్దరు నిహంగులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.

రైతులు ఆందోళన జరుపుతున్న సింఘూ సరిహద్దులో జరిగిన మూకదాడిలో లఖ్‌బీర్‌సింగ్ హత్య చేయబడటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ హత్యతో తమకు సంబంధం లేదని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సిక్కులలోని నిహంగులనే వర్గం రైతుకూలీయైన లఖ్‌బీర్‌సింగ్‌పై అమానుష దాడికి పాల్పడినట్టు గుర్తించారు. సిక్కుల పవిత్ర గ్రంధానికి లఖ్‌బీర్ అవమానం కలిగించారని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురి చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో నీలిరంగు వస్త్రాలు, కత్తులు ధరించిన నిహంగులను పోలీసులు గుర్తించారు. కనీసం 10 చోట్ల లఖ్‌బీర్ శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. లఖ్‌బీర్ అంత్యక్రియల్ని శనివారం రాత్రి పంజాబ్‌లోని ఆయన స్వగ్రామం చీమాకలాన్‌లో నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులు మినహా సిక్కు మత గురువుగానీ, ఆ గ్రామస్థులుగానీ హాజరు కాలేదని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News