Friday, November 15, 2024

వేధింపుల కేసులో నిందితులకు ఆరు రోజుల శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఐదుగురు నిందితులకు ఆరు రోజుల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పు చెప్పింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీటీమ్స్‌కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన షీటీమ్స్ పోలీసులు విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారు.

నిందితుల్లో ప్రభుత్వ మాజీ న్యాయవాది ఎ. సంజయ్‌కుమార్ ఉన్నారు. న్యాయవాది తనను కోర్టులో గత కొంత కాలం నుంచి వేధిపులకు గురిచేస్తున్నాడని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టులో పల బయట తనను శారీరకంగా కలిసేందుకు ఒప్పుకోవాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న షీటీమ్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాదిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు వేధింపులపై షీటీమ్స్ హెల్ప్‌లైన్ నంబర్ 9490616555కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని లేకుంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News