Sunday, March 30, 2025

ఈజిప్టు తీరంలో టూరిస్ట్ సబ్‌మెరైన్ మునిగి ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఈజిప్టు తీర నగరమైన హుర్‌ఘడలో ఎర్ర సముద్రంలో టూరిస్టు సబ్‌మెరైన్ మునిగి ఆరుగురు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. ఆ సమయంలో సబ్‌మెరైన్‌లో దాదాపు 45 మంది ఉన్నారు. అత్యవసర సహాయ దళాలు మునిగిపోతున్న 29 మందిని రక్షించగలిగారు. పగడాల దిబ్బలతో హుర్‌ఘడ నగరం బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. టూరిస్టు సబ్‌మెరైన్లు ఎప్పుడూ పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఈ సబ్‌మెరైన్ హుర్‌ఘడ లోని సింద్‌బాద్ హోటల్‌కు చెందినది. రెగ్యులర్‌గా ఈ సబ్‌మెరైన్ టూరిస్టులను పగడాల దిబ్బల వరకు తీసుకెళ్తుంటుంది. ఇక్కడ సముద్రంలో 25 మీటర్ల లోతు వరకు అనుమతిస్తుంటారు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News