Friday, January 10, 2025

ఆటోరిక్షాకు కారు ఢీకొని ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆగ్రా : ఆటోరిక్షాకు స్పీడుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖేరగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 10.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( వెస్ట్) సోనం కుమార్ చెప్పారు.

మృతులు జయప్రకాష్, సుమిత్, బ్రజేష్ దేవి, బ్రజ్‌మోహన్ శర్మ, మనోజ్ శర్మ, ఆటోరిక్షాడ్రైవర్ భోలా గా గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి పరారీలోఉన్నాడని, ఆయన స్నేహితులు పింకు, బనియా లను అరెస్టు చేశామని డిసిపి చెప్పారు. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ బంటీ ఆల్కహాలు మత్తులో ఉన్నాడని, తన స్నేహితులను దించివేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News