Sunday, December 22, 2024

ఇంటిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని వాయవ్య పీతమ్‌పురా ప్రాంతంలో గురువారం రాత్రి ఒక బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయినట్లు అధికారులు వెల్లడించారు. భవనం మొదటి అంతస్తులో మంటలు ప్రజ్వరిల్లడానికి కారణం ఇంకా నిర్ధారించవలసి ఉందని వారు తెలిపారు. పీతమ్ జడ్‌పి బ్లాక్‌లో 37 నంబర్ ప్లాట్ గురువారం రాత్రి 8 గంటలకు అగ్ని ప్రమాదం గురించి ఒక కాల్ వచ్చినట్లు అగ్నిమాపక దళ అధికారులు తెలియజేశారు.

స్థానిక పోలీసుల సాయంతో ఏడుగురు వ్యక్తులను రక్షించి బాబూ జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు మహిళలతో సహా ఆరుగురిని మరణించినట్లు ఆసుపత్రిలో ప్రకటించారని ఢిల్లీ అగ్నిమాపక దళం (డిఎఫ్‌ఎస్) అధికారి ఒకరు తెలిపారు. మంటలను ఒక గంటలో ఆర్పివేసినట్లు మరొక డిఎఫ్‌ఎస్ అధికారి చెప్పారు.ఆ భవనం మొదటి అంతస్తులో మంటలు ప్రజ్వరిల్లినట్లు, దానిపైగల మూడు అంతస్తులను పొగ కమ్మివేసినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News