Monday, December 23, 2024

ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడి ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

షాజహాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ట్రాక్టర్ ట్రాలీ బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గర్రా నది నుంచి నీటిని తీసువస్తుండగా శనివారంప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 30మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) బాజ్‌పాయ్ మాట్లాడుతూ రక్షిత చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకుని రెస్కూ ఆపరేషన్ చర్యలు చేపట్టాయి. రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై ప్రమాదం జరిగిందని, బాధితులు అజ్మత్‌పూర్ గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు. వీరు ‘భాగవత్ కథ’ కోసం నదిలోని నీటిని తీసుకువస్తుండగాప్రమాదానికి గురయ్యారన్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్య కళాశాలకు చికిత్సకోసం తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News