Saturday, December 21, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ కుశినగర్ హైవేపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా , మరో 25 మందికి గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న ఓట్రక్కు ఆగిఉన్న ప్రైవేట్ బస్సును వెనుకవైపునుంచి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జగదీశ్‌పూర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. టైర్ పేలడంతో బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండింది. కొంతమంది ప్రయాణికులు బస్సులోంచి కిందికి దిగగా, మిగతా వాళ్లు బస్సులోనే ఉన్నారు.

అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టినట్లు పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోగా మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. మృతుల్లో నలుగురు కుశి నగర్‌కు చెందిన వారుగా గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News