Sunday, December 22, 2024

కారును ఢీకొట్టిన బస్సు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరీ బజార్-రుద్రాపూర్ రోడ్డు ఎస్‌యువి కారు-బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి శ్రీపతి మిశ్రామ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బస్సు ఎదురుగా వస్తున్న ఎస్‌యువిని ఢీకొట్టందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News