- Advertisement -
అమరావతి: విశాఖలో బ్లాక్ ఫంగస్ బుసలు కొడుతోంది. ఫంగస్ బారినపడి ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో 113 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ మందుల కొరత లేదని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకే రోగులకు ఇంజక్షన్లు ఇస్తున్నట్టు తెలిపారు. అటు విశాఖలో పదుల సంఖ్యలో కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కరోనా మమహ్మరి తగ్గుతోంది అనేలోపై బ్లాక్ ఫంగస్ టెక్షన్ పెడుతోంది. అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. కేసుల సంఖ్య 100దాటింది. వైరస్ బారినపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కాకినాడు జిజిహెచ్ లో 60 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
Six died with black fungus in Visakhapatnam
- Advertisement -