Monday, December 23, 2024

ఆరుగురు దివ్యాంగ స్విమ్మర్స్ సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : భారతదేశానికి చెందిన ఆ రుగురు దివ్యాంగ స్విమ్మర్స్ ఆసియా ఖండంలోనే ఇం గ్లీ ష్ చానల్ ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన కోచ్ దినేష్ రజోరియా తెలిపిన వివరాల ప్ర కారం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివ్యాంగుడు శివకుమార్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన దివ్యాంగ స్వి మ్మర్ ఈనెల 8న ఇంగ్లీష్ చానల్ ఈదడానికి బ్రిటన్ రాజధాని లండన్‌కు వెళ్లారు. లండన్ సమయం ప్రకారం ఈ నెల 18వ తేదీ తెల్లవారు జామున ఉదయం 3గంటలకు ఇంగ్లీష్ చానల్ ఈదడం ప్రారంభించి, రానూపోనూ 78 కిలోమీటర్లను కేవలం 31గంటల్లో ఈది విజయవంతం గా పూర్తి చేసి, లండన్‌లో జాతియ జెండా ఎగురవేశారు.

ఇంగ్లీష్ చా న ల్ ఈదిన వారిలో తెలంగాణకు చెం దిన శివకుమార్ (మెదక్, జిల్లావా సి), పశ్చిమ బెంగాల్‌కు చెందిన రి మోసాహా, తమిళనాడుకు చెందిన స్నేహన్ ఎన్.ఏ, మధ్యప్రదేశ్‌కు చెం దిన తేంద్రసింగ్, అస్సాంకు చెందిన ఎల్సిస్ ఆలీ హజారికా, మహారాష్ట్ర కు చెందిన జయంత్ డూబుల్‌లు ఆసియా ఖండంలోనే మొట్ట మొదటి దివ్యాంగ స్విమ్మర్స్‌గా రికార్డు సృష్టించి, భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇంగ్లీష్ చానల్‌లో రెండు వైపుల ఈదిన స్విమ్మర్‌గా రికార్డు కెక్కా రు. రికార్డు సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్, భారతదేశ అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్విని విక్టోరియాతో పాటు పలువురు ప్రముఖులు శివకుమార్‌తో పాటు పలువురు స్విమ్మర్స్‌ను ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News